Rakhi Sawant | బాలీవుడ్ నటి రాఖీ సావంత్‌కు బెదిరింపు మెయిల్
బాలీవుడ్ భామ రాఖీ సావంత్‌కు (Rakhi Sawant) లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది.
ముంబై : బాలీవుడ్ భామ రాఖీ సావంత్‌కు (Rakhi Sawant) లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచినందుకు తనకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి లేటెస్ట్ మెయిల్లో హెచ్చరించారని రాఖీ సావంత్ వెల్లడించింది. సల్మాన్‌కు దూరంగా ఉండాలని బిష్ణోయ్ గ్యాంగ్ తనను హెచ్చరించిందని ఆమె పేర్కొన్నారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను ఇదే ముఠా హత్య చేయగా సల్మాన్ ఖాన్‌కు సైతం ప్రాణహాని తలపెడతామని పలుమార్లు బెదిరించింది. మీడియాతో రాఖీ సావంత్ మాట్లాడుతున్న వీడియోను నటి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తనకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పంపిన బెదిరింపు మెయిల్‌ను మీడియా సమక్షంలో ఆమె బిగ్గరగా చదువుతుండటం ఈ వీడియోలో కనిపించింది.
సల్మాన్ ఖాన్ గురించి నువ్వు మాట్లాడితే నిన్ను చంపేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ తనను బెదిరించిందని ఆమె చెప్పుకొచ్చారు. తన తల్లి అనారోగ్యానికి గురైన సమయంలో సల్మాన్ ఆమెకు సాయం చేశాడని, అందుకే తాను సల్మాన్ గురించి మాట్లాడతానని రాఖీ సావంత్ తెలిపింది. తన తల్లిని క్యాన్సర్ నుంచి కాపాడేందుకు సల్మాన్ రూ. 50 లక్షలు వెచ్చించారని గుర్తుచేశారు. తాను సల్మాన్ గురించి ఎందుకు మాట్లాడకూడదని ఆమె నిలదీశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సామాజిక సమస్యలను కళాత్మకంగా మలచిన కేఎల్’
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

