ఇల్లెందు రాంబాయి ప్రేమకథ
‘నీది నాది ఒకే కథ’ ‘విరాటపర్వం’ వంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న చిత్రానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
‘నీది నాది ఒకే కథ’ ‘విరాటపర్వం’ వంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన నిర్మాతగా మారి తొలి ప్రయత్నంగా రూపొందిస్తున్న చిత్రానికి ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా ద్వారా సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరంగల్, ఖమ్మం సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో కథానాయికను యెనగంటి రాంబాయి పాత్రలో పరిచయం చేశారు. బొగ్గు గనుల ప్రాంతమైన ఇల్లెందు మండలం నేపథ్యంలో అందమైన గ్రామీణ ప్రేమకథగా తీర్చిదిద్దిన్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘కథ జరిగిన ప్రాంతం, అక్కడి మనుషుల అమాయకత్వం, వారి మధ్య సంఘర్షణ నన్ను ఎంతగానో కదిలించింది. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఘట్టాలు కొన్ని రోజుల పాటు నిద్రపోనివ్వలేదు. ఇంతటి వైవిధ్యమైన ప్రేమకథను ఇప్పటివరకు వినలేదు. ఈ కథ విని ఈటీవీ విన్ వాళ్లు మాతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు’ అని చెప్పారు. ఈ కథలోని పాత్రలన్నీ సహజంగా కనిపిస్తాయని ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వాజిద్ బేగ్, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాతలు: వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి, రచన-దర్శకత్వం: సాయిలు కంపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

