Dunki | బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనా రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) డైరెక్షన్లో అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో వచ్చిన చిత్రం డంకీ (Dunki). ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
తాప్సీ పన్ను ఫీ మేల్ లీడ్ రోల్ పోషించగా.. బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన డంకీ అభిమానులను నిరాశపరచకుండా పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన మౌత్ టాక్ చెబుతోంది. డంకీని చూసిన తర్వాత కమెడియన్ సునీల్ పాల్ మాట్లాడుతూ.. రాజ్‌కుమార్ హిరానీ మరియు షారుఖ్ ఖాన్ చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు… సందేశం ‘సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా’… మసాలా చిత్రాల కోసం చూసినా.. మంచి సినిమాల కోసం చూసినా.. ఇది మాత్రం చాలా అర్థవంతమైన చిత్రం…డంకీకి నేను 5కి 4 స్టార్స్ ఇస్తాను అన్నాడు.
ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ డంకీ ప్రమోషన్స్‌లో తన నెక్ట్స్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ వార్త చెప్పి అభిమానుల్లో జోష్ నింపాడు. తాను చేయబోయే కొత్త సినిమా 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో షురూ కానుందని చెప్పారు. అంతేకాదు నా వయస్సుకు తగ్గ సినిమా చేయాలని, హీరోగా, యాక్టర్‌గా ప్రయాణాన్ని సాగించాలని అనుకుంటున్నానని చెప్పాడు షారుఖ్ ఖాన్. అయితే నెక్ట్స్ సినిమా డైరెక్టర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు. బాద్ షా ప్రస్తుతం పలువురు బాలీవుడ్ డైరెక్టర్లతోపాటు కొందరు సౌత్ డైరెక్టర్లతో స్టోరీ డిస్కషన్స్‌లో ఉన్నాడని బీటౌన్ సర్కిల్లో కథనాలు రౌండప్ చేస్తుండగా.. మరి ఎవరితో సినిమా చేస్తాడనేది తెలియాల్సి ఉంది.
#WATCH | Mumbai | After watching Dunki, comedian-actor Sunil Pal says, “…Rajkumar Hirani and Shah Rukh Khan have given a very good message…The message is ‘Saare jahan se achcha Hindustan hamara’…Look for either masala films or meaningful films. This is a meaningful film…I… pic.twitter.com/bVxIammS6o
— ANI (@ANI) December 21, 2023
Dunki Drop 6 Banda సాంగ్..
Vaade ka pakka, yaaron ka yaar…Hardy jaisa Banda aaj ki tareekh mein nahi milega kahin yaar!#DunkiDrop6 – #Banda song out now! https://t.co/VqdHmIKbxP#Dunki releasing worldwide in cinemas on Thursday, 21st December, 2023. pic.twitter.com/usE54Jv6em
— Rajkumar Hirani (@RajkumarHirani) December 18, 2023
Dunki Drop 5 అప్డేట్..
Coming up….#DunkiDrop5 – #OMaahi Promotional Video Out Soon!#Dunki releasing worldwide in cinemas on 21st December, 2023. pic.twitter.com/HKiyOzBcPw
— Rajkumar Hirani (@RajkumarHirani) December 11, 2023
Lutt Putt Gaya సాంగ్..
Loved #LuttPuttGaya ❤️😍
Will be a Chartbuster for sure just like JJP and Chaleya#SRK doesn’t age at all, the energy mahn 🥵🥶
The innocence of 90s is full on in this song ❤️
And #SRK chemistry with #TaapseePannu spot on
Cute!! 😍
A must needed break from Action movies!! pic.twitter.com/UNp6ihCpiZ
— 𝙰𝚗𝚞𝚓 🇮🇳𝚂𝚁𝙺𝚒𝚊𝚗🇮🇳 (@anujrocks44) November 22, 2023
Dunki Drop 1 ఫస్ట్ వీడియో..