Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Jailer 2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
Jailer 2 | సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్క్‌ను దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగి బాబు, విద్యాబాలన్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. దసరా సెలవులు, వీకెండ్ కలిసిరావడంతో సినిమా కలెక్షన్లకు తిరుగులేకుండా పోయింది.
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. ఈ చిత్రం ఐదో రోజు రూ. 43.35 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టడంతో, ఇండియాలో దీని మొత్తం నెట్ కలెక్షన్స్ రూ. 287.80 కోట్లకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే రూ. 541 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా, 2026 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’, అజయ్ దేవగన్ ‘దృశ్యం 3’ చిత్రాలు తొలి రెండు స్థానాల్లో ఉండగా, త్వరలోనే ‘జైలర్ 2’ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మొదటి భాగం ‘జైలర్’ లైఫ్‌టైమ్ కలెక్షన్స్ (రూ. 604.74 కోట్లు) రికార్డును కూడా ఈ సీక్వెల్ అతి త్వరలోనే బ్రేక్ చేసేలా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో సిఫార్సు లేఖలు బంద్!
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

