Rajinikanth | అగ్ర కథానాయకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘ధర్మన్’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తలైవా ‘ది డెడ్లీ డాక్టర్’ అవతారంలో కనిపించనున్నారు. న్యాయాన్ని గెలిపించే ఓ వైద్యుడిగా రజనీకాంత్ పాత్ర చాలా వైవిధ్యంగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ఉలగనాయగన్ కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రజనీ, కమల్ కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత సినిమా రావడం విశేషం. ఈ చిత్రంలో సిమ్రన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా చిత్రబృందం ‘ది ఓజీ స్వాగ్’ అనే క్యాప్షన్‌తో టైటిల్ పోస్టర్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో రజనీకాంత్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ మరోసారి అభిమానులను ఫిదా చేస్తున్నాయి. డాక్టర్ కోట్లో స్టెతస్కోప్‌తో, సీరియస్ లుక్‌లో తలైవా లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యాయం కోసం ఏ స్థాయికైనా వెళ్లే డాక్టర్‌గా రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘ధర్మన్’ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. రజనీ మార్క్ యాక్షన్, డైలాగ్స్, ఎమోషన్‌తో పాటు సామాజిక అంశాలను టచ్ చేసే కథతో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది.