Kantara 2 | కాంతార-2లో రజినీకాంత్.. రిషబ్‌శెట్టి మౌనం వెనుక అర్థం అదేనా?
కాంతార’ చిత్రం గత ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కన్నడంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది.
Kantara 2 | ‘కాంతార’ చిత్రం గత ఏడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కన్నడంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌ను రూపొందించబోతున్నట్టు చిత్ర దర్శకుడు, హీరో రిషబ్‌శెట్టి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇందుకోసం కథాపరంగా పరిశోధన చేస్తున్నానని ఆయన తెలిపారు. తాజాగా ఈ ప్రీక్వెల్‌లో రజనీకాంత్ కీలక పాత్రలో నటించనున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రిషబ్‌శెట్టిని ఈ విషయం గురించి అడగ్గా ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. దాంతో ‘కాంతార-2’లో రజనీకాంత్ భాగం కావొచ్చనే వార్తలకు బలం చేకూరినట్టయిందని అంటున్నారు. ‘కాంతార’ విడుదల అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు రజనీకాంత్. చెన్నైలోని తన స్వగృహానికి రిషబ్‌శెట్టిని ఆహ్వానించి అభినందించారు. ‘కాంతార-2’ చిత్రం జూన్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

