Rajinikanth Tears | రజనీకాంత్‌ను ఏడిపించిన డైరెక్టర్..తలైవా మాటల్లోనే..
రజనీకాంత్ (Rajinikanth) నటించిన చిత్రం అన్నాత్తే (Annaatthe). తెలుగులో పెద్దన్నగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హూట్ యాప్ ద్వారా శివతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు రజనీకాంత్.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించిన చిత్రం అన్నాత్తే (Annaatthe). తెలుగులో పెద్దన్నగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగులో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తమిళ్లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. డైరెక్టర్ శివ (Siva) తొలిసారి రజనీకాంత్‌తో సినిమా చేశాడు. హూట్ యాప్ ద్వారా శివతో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు రజనీకాంత్.
‘పేట, విశ్వాసం సినిమాలు ఒకే టైంలో విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. నేను విశ్వాసం (Vishwasam) నిర్మాతను సంప్రదించి నాకు సినిమా స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని అడిగాను. సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్‌లో ఈ చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేంత ప్రత్యేకత ఏముందనుకున్నా. కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి సినిమా రంగు మారిపోయింది. సినిమా పూర్తయిన తర్వాత చప్పట్లు కొట్టడం ఆపేశాను. ఆ తర్వాత నిర్మాత త్యాగరాజన్ని అభినందించి, శివతో మాట్లాడాలని ఆసక్తిగా ఉందని’ చెప్పానన్నారు.
‘శివతో మొదటి సంభాషణ తర్వాత అతడిపై బాగా నమ్మకం పెరిగింది. శివ చాలా అమాయకంగా, నిజాయితీగా ఉంటాడు. నీ దగ్గర నా కోసం ఏదైనా కథ ఉందా..? మనం విశ్వాసం సినిమాలా మంచి హిట్టు కొట్టాలని శివను అడిగాను. దీనికి శివ స్పందిస్తూ..మీతో హిట్ సినిమా తీయడం చాలా సులభమని నాతో అన్నాడు. గతంలో ఏ దర్శకుడు నాతో ఇలాంటి కామెంట్ చేయలేదు. శివకున్న ఆత్మవిశ్వాసం బాగా నచ్చింది. నా కోసం 20 రోజుల్లో కథ సిద్దం చేశాడు. రెండు గంటలకుపైగా నాకు కథ వినిపించాడు. కథ విన్న తర్వాత నాకు కన్నీళ్లు వచ్చాయి. నాకు ఎలా కథ చెప్పాడో..అలానే సినిమా చేయాలని చెప్పాను. కథనం కంటే ఉత్తమంగా సినిమా చేస్తానని నాకు మాటిచ్చాడని’ చెప్పుకొచ్చారు రజనీకాంత్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha As Khatija | సమంత పాత్రను పరిచయం చేసిన డైరెక్టర్..
Prakash Raj silence | నా గొంతుకు వారం విశ్రాంతి..ప్రకాశ్‌రాజ్ ట్వీట్ వైరల్
Biker Naatu Naatu Dance | ట్రాఫిక్ సిగ్నల్‌లో బైకర్ ‘నాటు నాటు’ డ్యాన్స్ ..వీడియో హల్చల్
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

