Likitha Murthy | అక్క వల్లే ఏడ్వడం నేర్చుకున్నా.. రాజేశ్వరి విలాస్ ఫేమ్ లిఖితా మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Likitha Murthy | డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. ఈ అమ్మాయి మాత్రం ‘నేను నటినంటే మాత్రం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు’ అంటున్నది. ‘బంగారు పంజరం’, ‘రాఖీ పౌర్ణమి’ తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లిఖితా మూర్తి..
Likitha Murthy | డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లు చాలామందే ఉంటారు. ఈ అమ్మాయి మాత్రం ‘నేను నటినంటే మాత్రం ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు’ అంటున్నది. ‘బంగారు పంజరం’, ‘రాఖీ పౌర్ణమి’ తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లిఖితా మూర్తి.. ‘రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్’తో జీ తెలుగు ఛానెల్లో సందడి చేస్తున్నది. ఆ ముచ్చట్లు మీకోసం..
లిఖితా మూర్తి అంటే నన్ను గుర్తు పట్టేవాళ్లు తక్కువే. రాజేశ్వరి అనగానే ఠక్కున గుర్తొస్తాను. ఇదంతా జీ తెలుగులో వస్తున్న ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ మహిమ. నా విషయానికొస్తే.. మాది బెంగళూరు. ప్రస్తుతం ఎమ్‌కామ్ మాస్టర్స్ చదువుతున్నా. ఎప్పటికప్పుడు సిలబస్ పూర్తి చేసుకుంటూ.. షూటింగ్‌కు వెళ్లాలంటే కష్టంగానే ఉంది. అయినా, పట్టుదలగా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. మార్కులు ఎనభై శాతానికి తగ్గడం లేదు. ఈ రంగంలోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. మా అక్క కల్పితామూర్తి కూడా నాలా సీరియల్ ఆర్టిస్టే. ఆమె డేట్స్ కోసం వచ్చిన నిర్మాతలు నన్ను చూసి ‘చక్కగా ఉన్నావ్. సీరియల్స్‌లో, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా’ అని సలహా ఇచ్చేవారు. దీంతో ఆడిషన్స్‌కు వెళ్లాను. ‘బంగారు పంజరం’ సీరియల్‌కు ఎంపికయ్యాను. అలా నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయింది.

Rajeswari Vilas
అమ్మ, నాన్న, అక్క నాకు చాలా మద్దతు ఇస్తారు. ధైర్యం నూరిపోస్తారు. అక్క దగ్గరే యాక్టింగ్ నేర్చుకున్నా. మిగతా ఎమోషన్స్ ఫర్వాలేదు కానీ, ఏడుపు నటించడం.. ఓ పట్టాన వచ్చేదికాదు. మధ్యలో ఫక్కున నవ్వేసేదాన్ని. నన్ను ఏడిపించడానికి అక్క చేయని ప్రయత్నాలు లేవు. అప్పుడే, తను ఓ చిట్కా చెప్పింది. అదో పరమ రహస్యం. నాతో డెమో షూట్ చేసిన మీర్ సర్ కూడా యాక్టింగ్‌లో మెలకువలు బోధించారు. ‘బంగారు పంజరం’, ‘రాఖీ పూర్ణిమ’ సీరియల్స్ దర్శకుడు రాము సార్ పాఠాలు నన్ను పూర్తి నటిగా మలిచాయి. ‘రాజేశ్వరి విలాస్..’ ప్రొడ్యూసర్ లంబోదర్ సర్.. అన్నయ్య లేని లోటు తీర్చారు.
ఇదే నా సలహా
పరిశ్రమలోకి రావాలనుకునే వారికి నా సలహా ఒకటే. ప్రోత్సాహంలేదనో, అవకాశాలు రావడంలేదనో నీరుగారి పోవద్దు. మనం గెలిచినరోజు ప్రపంచమంతా మన వెనకాలే నిలుస్తుంది. ఈ విషయం గుర్తు పెట్టుకొని ముందుకు వెళ్లండి చాలు. నేనూ ఇదే సూత్రం ఫాలో అవుతున్నా.
– ప్రవీణ్ కుమార్ సుంకరి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

