Rajinikanth | రజనీకాంత్ కొత్త చిత్రం
‘జైలర్' చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే ఆయన అతిథి పాత్ర పోషించగా..ఇటీవల విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
‘జైలర్’ చిత్రంతో గత ఏడాది భారీ విజయాన్ని దక్కించుకున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. అయితే ఆయన అతిథి పాత్ర పోషించగా..ఇటీవల విడుదలైన ‘లాల్ సలాం’ చిత్రం మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. రజనీకాంత్ ప్రస్తుతం టీజీ జ్ఞానవేల్‌రాజా, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన లైనప్‌లోకి మరో భారీ సినిమా చేరింది. బాలీవుడ్లో ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలతో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు సాజిద్ నదియావాలా.
ఆయన త్వరలో రజనీకాంత్‌తో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ రజనీకాంత్‌తో దిగిన ఫోటోను షేర్ చేశారు. ‘రజనీకాంత్ వంటి లెజెండ్‌తో సినిమా చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మా ప్రయాణం మరచిపోలేని విధంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సాజిద్ నదియావాలా పేర్కొన్నారు. ఈ సినిమాకు సంబంధించిన దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సాజిద్ నదియావాలా ప్రస్తుతం బాలీవుడ్లో ‘చందూ ఛాంపియన్’ ‘హౌస్‌ఫుల్-5’ వంటి భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

