Keeravani | ఆ వీడియో చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. నా జీవితంలో అదే అత్యంత విలువైన బహుమతి : కీరవాణి
‘ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటారు స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్. తాజాగా వీరిద్దరిని దిగ్గజ అమెరికన్ సంగీతకారుడు రిచర్డ్ కార్పెంటర్ ప్రత్యేకంగా అభినందించారు. తాను రిచర్డ్ కార్పెంటర్‌ను ఎంతగానో ఆరాధిస్తానని, ఆయన పాటలు వింటూ పెరిగానని ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం కీరవాణి తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
Keeravani | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకొని భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని విశ్వవేదికపై ఘనంగా చాటారు స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్. తాజాగా వీరిద్దరిని దిగ్గజ అమెరికన్ సంగీతకారుడు రిచర్డ్ కార్పెంటర్ ప్రత్యేకంగా అభినందించారు. తాను రిచర్డ్ కార్పెంటర్‌ను ఎంతగానో ఆరాధిస్తానని, ఆయన పాటలు వింటూ పెరిగానని ఆస్కార్ పురస్కారాన్ని స్వీకరించిన అనంతరం కీరవాణి తన ప్రసంగంలో పేర్కొన్న విషయం తెలిసిందే.
రిచర్డ్ కార్పెంటర్ ప్రఖ్యాత గీతం ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’ను ఆలపించి తన అభిమానాన్ని చాటుకున్నారు కీరవాణి. తాజా వీడియోలో రిచర్డ్ కార్పెంటర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’ పాటను పాడుతూ కీరవాణి, చంద్రబోస్‌లకు శుభాకాంక్షలందజేశారు. ఈ వీడియో చూసి తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని, తన జీవితంతో అత్యంత విలువైన బహుమతి ఇదేనని కీరవాణి భావోద్వేగంగా స్పందించారు. రాజమౌళి సైతం రిచర్డ్ కార్పెంటర్ వీడియోపై స్పందిస్తూ ‘ఆస్కార్ క్యాంపెయిన్‌లో అన్నయ్య కీరవాణి ఎక్కడా తన భావోద్వేగాల్ని బయటపెట్టలేదు. ప్రతి చోటా ప్రశాంతంగా కనిపించారు. కానీ మీ వీడియో చూసిన తర్వాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మీరిచ్చిన ఈ బహుమతిని మా కుటుంబం మొత్తం గుర్తుంచుకుంటుంది’ అని అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

