Rajamouli | పారిస్‌లో జక్కన్నకు అరుదైన గౌరవం.. ఫ్రాన్స్ చారిత్రక హాల్లో ఎస్.ఎస్. రాజమౌళికి శాశ్వత సీటు
Rajamouli | భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా చూడని దర్శకుడిగా జక్కన్న ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడమే కాకుండా, తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకొచ్చింది.
Rajamouli | భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క పరాజయం కూడా చూడని దర్శకుడిగా జక్కన్న ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన రూపొందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడమే కాకుండా, తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఖాతాలో తాజాగా మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం చేరింది.
ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజమౌళిని అక్కడి ప్రముఖ సినీ సంస్థ ‘సినెమాథెక్ ఫ్రాన్సైస్’ ఘనంగా సత్కరించింది. పారిస్ నగరంలోని చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో ఆయన పేరిట శాశ్వత సీటును ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. ప్రపంచ సినీ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో చోటు దక్కడం ప్రతి దర్శకుడికీ అరుదైన గౌరవంగా భావిస్తారు. ఫ్రెంచ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కోస్టా గావ్రాస్ సమక్షంలో ఈ గౌరవాన్ని రాజమౌళికి అందించారు. అదేవిధంగా రాజమౌళి తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం కూడా కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తనకు లభించిన ఈ అరుదైన గౌరవంపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పారిస్‌లో తన సినిమాలను ప్రదర్శించడమే గొప్ప గౌరవమని భావించానని, కానీ హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో తన పేరిట శాశ్వత సీటు ఏర్పాటు చేయడం జీవితంలో ఊహించని సంఘటనగా అభివర్ణించారు.
ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ప్రపంచ సినీ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ సంస్థలో నాకు చోటు దక్కడం జీవితాంతం గుర్తుండిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమాపై ప్రత్యేక గౌరవం చూపిన కోస్టా గావ్రాస్తో పాటు సినెమాథెక్ ఫ్రాన్సైస్ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంతో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్‌లో లభించిన ఈ గౌరవం తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మైలురాయిగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక భారతీయ ప్రాంతీయ దర్శకుడికి ఇలాంటి అరుదైన గుర్తింపు రావడం దేశ సినీ చరిత్రలో విశేషంగా నిలిచిపోనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

