Raja Vaaru Rani Gaaru | నాలుగేళ్ల తర్వాత టీవీలోకి.. రాజావారు రాణిగారు వరల్డ్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే..!
Raja Vaaru Rani Gaaru | ప్రస్తుతం రుథిరమ్ కృష్ణ దర్శకత్వంలో రూల్స్ రంజన్ (Rules Ranjann) సినిమాలో నటిస్తున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు (Raja Vaaru Rani Gaaru) సినిమాతో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇచ్చాడని తెలిసిందే.
Raja Vaaru Rani Gaaru | ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ప్రస్తుతం రుథిరమ్ కృష్ణ దర్శకత్వంలో రూల్స్ రంజన్ (Rules Ranjann) సినిమాలో నటిస్తున్నాడు. డీజే టిల్లు ఫేం నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి గారు (Raja Vaaru Rani Gaaru) సినిమాతో సిల్వర్ స్క్రీన్ డెబ్యూ ఇచ్చాడని తెలిసిందే. రవి కిరణ్ కోల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2019 నవంబర్ 29న విడుదలైంది. అయితే ఈ సినిమా టీవీలో మాత్రం విడుదల కాలేదు. సుమారు నాలుగేళ్ల తర్వాత రాజా వారు రాణి గారు టీవీ ప్రీమియర్ డేట్ వచ్చేసింది. రాజా వారు రాణి వారు సెప్టెంబర్ 10న సాయంత్రం 06:30 గంటలకు ఈటీవీ ఛానల్లో ప్రీమియర్ కానుంది.
ఈ సినిమాతో రహస్య గోరక్ కూడా హీరోయిన్గా డెబ్యూ ఇచ్చింది. రాజ్‌కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం కీలక పాత్రల్లో నటించారు. ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి జే క్రిష్ సంగీతం అందించాడు. మరి ఇన్నాళ్లు గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రానికి టీవీలో ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలి. కిరణ్ అబ్బవరం మరోవైపు విశ్వకరుణ్ దర్శకత్వంలో KA9 (KA9)కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

