Sarangadhariya | తొలిసారి లీడ్ రోల్లో రాజా రవీంద్ర.. సస్పెన్స్‌గా సారంగదరియా
Sarangadhariya |రాజా రవీంద్ర (Raja Ravindra తొలిసారి లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహిస్తున్నాడు. సారంగదరియా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే.
Sarangadhariya | నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర (Raja Ravindra). మెగాస్టార్ చిరంజీవితోపాటు చాలా మంది హీరోల సినిమాల్లో నటించి యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తొలిసారి లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘సారంగదరియా’ (Sarangadhariya). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి పద్మారావు అబ్బిశెట్టి (డెబ్యూ)దర్శకత్వం వహిస్తున్నాడు. సారంగదరియా టీజర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. సాయిజా క్రియేషన్స్ పతాకం పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు.
నిద్రముఖంది చేసే చిన్న చిన్న పని కూడా గంటల తరబడి చేస్తుంది.. అంటూ రాజారవీంద్ర తన భార్య గురించి చెప్పే డైలాగ్స్‌తో షురూ అయింది టీజర్. రాజారవీంద్ర కొడుకులు, కూతురు చుట్టూ తిరిగే కథాంశంతో ఈ మూవీ ఉండబోతున్నట్టు టీజర్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే ఓ వ్యక్తికి తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి ఆ తండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. లీడ్ యాక్టర్‌గా రాజారవీంద్ర పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం ఖాయమని టీజర్‌తో తెలిసిపోతుంది
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అందుకోవా, నా కన్నులే అనే లిరికల్ సాంగ్స్‌ను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సారంగదరియా టీజర్‌పై ఓ లుక్కేయండి మరి..
.#Sarangadhariya Teaser Launched By Hero @sreevishnuoffl https://t.co/qRUOYkBho4 🤏🏻🤏🏻#RajaRaveendar #ShivakumarRamachandravarapu @Moin_here #EbenezerPaul #PadmaraoAbbisetti @saijacreations @MohanSuperhit pic.twitter.com/Git1db31Fd
— BA Raju’s Team (@baraju_SuperHit) April 18, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

