రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘స్టాండప్ రాహుల్’. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. శాంటోమోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ఈ చిత్రంలోని ‘నా తప్పా..’ లిరికల్ సాంగ్ ను సోమవారం హీరో నితిన్ విడుదల చేశారు. స్వీకర్ అగస్త్యి స్వరపరిచిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు. రఘురామ్ సాహిత్యాన్ని అందించారు. ‘స్టాండప్ కమెడియన్ గా కథానాయకుడు చేసే హంగామా తెరపై చూడాలి’ అని దర్శకుడు చెప్పారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నదీ చిత్రం.