Rahul Ravindran | ‘పురుషులపై మహిళల నేరాలు’ అనే పాయింట్‌తో సినిమా చేయండి.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ దర్శకుడికి నెటిజన్ వింత కోరిక
TheGirlFriend Director | ఇటీవల రష్మిక మందన్నా ‘గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సినిమాతో మెప్పించిన ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు సోషల్ మీడియాలో ఒక నెటిజన్ నుంచి ఊహించని విజ్ఞప్తి ఎదురైంది.
Rahul Ravindran | ఇటీవల రష్మిక మందన్నా ‘గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) సినిమాతో మెప్పించిన ప్రముఖ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు సోషల్ మీడియాలో ఒక నెటిజన్ నుంచి ఊహించని విజ్ఞప్తి ఎదురైంది. ఇటీవల పుణెలో సంచలనం సృష్టించిన ‘కేతన్ అగర్వాల్ హత్య కేసు’ (నిశ్చితార్థం జరిగిన యువతి తన ప్రియుడితో కలిసి కాబోయే భర్తను కొండపై నుంచి నెట్టేసిన ఘటన)ను ఉద్దేశిస్తూ.. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ తరహాలోనే పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాల నేపథ్యంలో ఒక సినిమా తీయాలని ఒక నెటిజన్ ఎక్స్ వేదికగా రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ కోరాడు. అయితే దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.. అత్యంత స్పష్టమైన, సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.
ఆ ఒక్క ఘటనతో సినిమా తీయలేను!
నెటిజన్ ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. నాకు అన్నీ తెలుసనే భ్రమలో నేను లేను, ఒకవేళ నేను చెప్పేది తప్పయితే నన్ను సరిదిద్దండి. కానీ, నేను ‘పురుషులపై మహిళలు చేసే అఘాయిత్యాలు’ అనే కోణంలో సమాజంలోని నేరాలను చూడను. సమాజంలో వ్యతిరేక ప్రవర్తన కలిగిన కొందరు వ్యక్తులు ఘోరమైన నేరాలకు పాల్పడుతుంటారు, అందులో కొందరు మహిళలు కూడా ఉండవచ్చు. కానీ, శతాబ్దాలుగా మహిళలను అణచివేస్తూ, వారి ఉనికిని చిన్నబుచ్చుతున్న ఒక వ్యవస్థీకృత వివక్ష ఈ సమాజంలో ఇప్పటికీ సాగుతోంది. నా చుట్టూ ఉన్న మహిళల నిజ జీవిత నిశ్శబ్ద పోరాటాలే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా తీయడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి అని పేర్కొన్నారు. పుణె కేతన్ అగర్వాల్ కేసు వివరాలను తాను ఇంకా పూర్తిగా చదవలేదని, తప్పకుండా చదువుతానని రాహుల్ తెలిపారు. ఒకవేళ ఆ ఘటనలో సినిమాకు సరిపడే భావోద్వేగం, కథాంశం కనిపిస్తే భవిష్యత్తులో ఆ మహిళ చేసిన నిర్దిష్ట నేరంపై సినిమా తీస్తానే తప్ప.. కేవలం ఎవరో అడిగారని ‘పురుషులపై మహిళల నేరాలు’ అనే అంశంపై సినిమా చేయనని ఆయన చెప్పుకోచ్చాడు.
తన సినిమాల శైలి భిన్నంగా ఉంటుందని వివరిస్తూ.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో విక్రమ్ పాత్ర హంతకుడు కాదు, అందులో శారీరక హింస ఉండదు. నమ్మకంగానే ఉంటూ ఒక మనిషి మనస్తత్వం, సంబంధాల మధ్య ఉండే సంక్లిష్టతతో అవతలి వ్యక్తిని ఎలా మానసిక వేధింపులకు గురిచేస్తారనేది నా కథల ప్రధానాంశం అని రాహుల్ వివరించాడు. అయితే ఈ పోస్ట్‌పై రాహుల్ సతీమణి, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘రాహుల్ లాంటి వ్యక్తిని చూసుకోండి లేదా పెళ్లి చేసుకోకుండా బాధపడకండి. ఇదే నా ఏకైక సలహా. మిగతాది మీ ఇష్టం, మీ జీవితం’ అంటూ ఆమె పోస్ట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

