Rahul Ramakrishna | కుమారుడి పేరేంటో చెప్పిన ఆర్ఆర్ఆర్ యాక్టర్.. ట్రెండింగ్‌లో స్టిల్
Rahul Ramakrishna | జాతిరత్నాలు సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). టాలెంటెడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ గతేడాది హరితను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందే.
Rahul Ramakrishna | అర్జున్ రెడ్డి చిత్రంలో హీరో స్నేహితుడు శివ పాత్రలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ అందరినీ ఆకట్టుకున్నాడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna). ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించి సూపర్ క్రేజ్ సంపాదించాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్లో కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే రాహుల్ రామకృష్ణ తన ఫాలోవర్లు, మూవీ లవర్స్ తో ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు. రాహుల్ రామకృష్ణ గతేడాది హరితను పెళ్లి చేసుకున్నాడని తెలిసిందే. అంతేకాదు హరిత పండంటి మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. కాగా తన కుమారుడి పేరేంటో ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. కుమారుడికి రుమి పేరు పెట్టినట్టు తెలియజేశాడు రాహుల్ రామకృష్ణ.
తల్లి రుమిని ఎత్తుకున్న స్టిల్‌ను రాహుల్ రామకృష్ణ అందరితో పంచుకున్నాడు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కంగ్రాట్స్ అన్నా.. రుమికి స్వాగతం.. అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. చిన్న రాహుల్ సార్ అంటూ మరో యూజర్ కామెంట్ పోస్ట్ చేశాడు. రాహుల్ రామకృష్ణ ప్రస్తుతం లీడ్ రోల్లో ఇంటింటి రామాయణంలో నటిస్తుండగా.. విడుదలకు రెడీ అవుతోంది.
విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, మారుతి టీం సమర్పణలో.. IVY ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నమూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నవ్య స్వామి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. నరేశ్ విజయ కృష్ణ, గంగవ్వ, సురభి ప్రభావతి, అంజి మామ, బిత్తిరి సత్తి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇంటింటి రామాయణం టీజర్ ..
Read Also :
Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Agent | ఏజెంట్ నుంచి ఊర్వశి రౌటేలా వైల్డ్ సాలా వీడియో సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

