రణబీర్‌కపూర్ రాముడి పాత్రలో నితేష్ కుమార్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ చిత్రం ఇటీవలే ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అయోధ్య సెట్లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరులో రణబీర్‌కపూర్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నారు. మూడు భాగాలుగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులను కూడా తీసుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏ.ఆర్.రెహమాన్, హాన్స్ జిమ్మర్ సంగీతాన్నందించబోతున్నారని తెలిసింది. హాన్స్ జిమ్మర్ ‘ది లయన్ కింగ్’ ‘ఇన్సెప్షన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఈ చిత్రంలో సీత పాత్రలో సాయిపల్లవి నటించనుంది. సన్నీ డియోల్ హనుమంతుడిగా, రావణాసురుడి పాత్రలో కన్నడ హీరో యష్ నటించనున్నారు.