రఘు కుంచె టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘గేదెల రాజు’. ‘కాకినాడ తాలూకా’ అనేది ఉపశీర్షిక. చైతన్య మోటూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.
‘నిజానికి ఈ సినిమాను ఈ నెల 17నే విడుదల చేయాలనుకున్నాం. కానీ ఆ రోజున తొమ్మిది సినిమాలు విడుదల కానుండటంతో మా సినిమాను ఈ నెల 24కి వాయిదా వేశాం. కంటెంట్ ఉన్న సినిమాను పది సినిమాల మధ్య విడుదల చేసి ఆస్థిత్వాన్ని కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే మా సినిమాను మరుసటి వారానికి వాయిదా వేశాం’ అని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.