Raghavendra Rao | బన్నీ ఆఫీస్‌లో రాఘవేంద్రరావు ఫోటో.. దర్శకేంద్రుడికి అల్లు అర్జున్ సగౌరవ సత్కారం
Raghavendra Rao | ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పట్ల ఉన్న గౌరవం, కృతజ్ఞతలు ప్రత్యేకమైనవి.
Raghavendra Rao | ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పట్ల ఉన్న గౌరవం, కృతజ్ఞతలు ప్రత్యేకమైనవి. తనను తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేసిన రాఘవేంద్రరావును నిత్యం స్మరించుకుంటూ, తన సినీ ప్రస్థానం ప్రారంభమైన దశను ప్రతిరోజూ గుర్తు చేసుకునేలా, అల్లు అర్జున్ తన కార్యాలయ ప్రవేశద్వారంలో దర్శకేంద్రుడి ఫోటోను ఏర్పాటు చేశారు. ఈ చర్య ఆయన వ్యక్తిగతంగా, వృత్తిపరంగా రాఘవేంద్రరావు పట్ల చూపించే గౌరవాన్ని చాటుతోంది.
కృతజ్ఞతా భావానికి నిదర్శనం
అల్లు అర్జున్ తన కెరీర్ విజయాల మీద మాత్రమే కాకుండా, తనకు మద్దతుగా నిలిచిన వారిపట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే విషయంలో ఎంతో విలువలతో ఉంటారు. ఈ విషయంలో ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది. రాఘవేంద్రరావు గారు తనను సినిమారంగంలోకి పరిచయం చేసిన తొలి దర్శకుడిగా, ఆయన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించారు. “అల్లు అర్జున్ తన కెరీర్ ఎదుగుదలకు తోడ్పడిన దర్శకుల విషయంలో ఎంతో జెన్యూన్ ప్రేమతో ఉంటాడు. వాళ్ల పట్ల ఎప్పుడూ ఆయన మనసులో ఎంతో గౌరవం ఉంటుంది. అందులో రాఘవేంద్రరావు గారు ఆయన జీవితంలో ఉన్న ప్రత్యేక స్థానం” అని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తన దర్శకులు, సాంకేతిక నిపుణులు, చిత్రబృందంలోని ఇతర సభ్యుల పట్ల అల్లు అర్జున్‌కు గల గాఢమైన భావోద్వేగ బంధం గురించి ఆయన తరచూ మాట్లాడుతుంటారు. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తొలిదశలో ఆయనకు సహాయపడిన వారిని అల్లు అర్జున్ ఎప్పటికీ మరిచిపోరు అని పలువురు అంటున్నారు.
అల్లు అర్జున్ కార్యాలయం ప్రవేశద్వారంలో ఉన్న రాఘవేంద్రరావు గారి చిత్రపటం ఆయనలో ఉన్న కృతజ్ఞత, గౌరవం, భావోద్వేగ సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ విలువలే ఆయన విజయాలకు పునాది మాత్రమే కాకుండా, స్టార్‌గా కాకుండా వ్యక్తిగా కూడా ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి అని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సంఘటన అల్లు అర్జున్ వ్యక్తిత్వంలోని గొప్పదనాన్ని, తన ఎదుగుదలకు కారణమైన వారిని ఎప్పటికీ మరువని ఆయన నిబద్ధతను స్పష్టం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

