శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మౌనముని ఎందరో స్టార్ హీరోలతో కలిసి పని చేశారు. ఇన్నాళ్లు ‘స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అని చెప్పిన ఆయన ఇన్నాళ్లుకు నటుడిగా మారాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి ‘పెళ్లి సందD’ చిత్రం తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాఘవేంద్రరావు వశిష్ట పాత్రలో సందడి చేయనున్నారు. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మౌనముని ఆన్‌స్క్రీన్‌లో ఎలా సందడి చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘పెళ్లి సందD’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాఘవేంద్ర రావు హీరోగానూ ఓ సినిమా చేస్తున్నారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్క్రిప్టు ఎప్పుడో సిద్ధమైంది. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో నలుగురు అగ్ర కథానాయికలు సైతం కనిపిస్తారని ప్రచారం సాగుతోంది.
తాజాగా దర్శకేంద్రుడు హీరోగా మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రానికి వి.ఎన్.ఆదిత్య దర్శకత్వం వహించనుండగా, ఈ సినిమాకి సంబంధించిన కథ కూడా సిద్ధమైందట. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా రానుందని అంటున్నారు. కాగా, ఓం నమో వెంకటేశ
తరవాత రాఘవేంద్ర రావు దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం జరిగింది, కాని నటుడిగా జోరు పెంచుతున్నారు.