శివ కంఠమనేని, రాశి, నందితాశ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన రాఘవ రెడ్డి వృత్తిపరంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అన్యాయాలను ఏమాత్రం సహించని అతనికి సంఘ విద్రోహక శక్తుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైంది? కటుంబ జీవితంలో అతనికి ఎదురైన సమస్యలేమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో ట్రైలర్ను తీర్చిదిద్దారు. ఎమోషనల్, యాక్షన్ అంశాలతో రూపొందించిన చిత్రమిదని, జనవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.