Raghava Lawrence | పొలిటికల్ ఎంట్రీపై రాఘవ లారెన్స్ యూటర్న్.. అభిమానులకు భారీ షాక్!
నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయాన్ని పూర్తిగా తన అభిమానులకే వదిలేస్తున్నట్లు లారెన్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
నటుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశంపై గత కొద్దిరోజులుగా కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. తను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే నిర్ణయాన్ని పూర్తిగా తన అభిమానులకే వదిలేస్తున్నట్లు లారెన్స్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పోటీ చేసి తప్పుకున్న తిరుచ్చి ఈస్ట్ (తిరుచిరాపల్లి తూర్పు) నియోజకవర్గం నుంచి లారెన్స్ బరిలోకి దిగబోతున్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తూ, తన రాజకీయ భవిష్యత్తుపై లారెన్స్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
తాజాగా మంగళవారం మధ్యాహ్నం సోషల్ మీడియా వేదికగా దాదాపు 16 నిమిషాల నిడివి గల ఒక సుదీర్ఘమైన వీడియోను పోస్ట్ చేసిన లారెన్స్, తన పొలిటికల్ ఎంట్రీపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని, తాను తిరుచిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అంతటితో ఆగకుండా, తాను ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన రాజకీయాల్లోకి రానని అనుకోవద్దని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ కేవలం సినిమాలపైనే ఉందని, ఒప్పుకున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడమే తన మొదటి ప్రాధాన్యతని వివరించారు. తాను ప్రత్యక్షంగా ఎన్నికల్లో నిలబడకపోయినా, తన ట్రస్ట్ ద్వారా సమాజానికి చేసే సేవలు మరియు సహాయ కార్యక్రమాలు ఎప్పటిలాగే నిరంతరాయంగా కొనసాగుతాయని ఈ కాంచన హీరో వెల్లడించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

