Raghav Chadha | పరిణీతి నా జీవితాన్నే మార్చేసింది.. నటితో బంధంపై తొలిసారి స్పందించిన ఆప్ ఎంపీ
Raghav Chadha | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తన జీవితాన్నే మార్చేసిందని ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) అన్నారు. నటితో తన బంధంపై రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు.
Raghav Chadha | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) తన జీవితాన్నే మార్చేసిందని ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) అన్నారు. నటితో ఎంపీ ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 13వ తేదీన ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, నటితో తన బంధంపై రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు.
ఒక మంచి రోజు ఆ అందమైన అమ్మాయి (పరిణీతి చోప్రా) తన జీవితంలోకి వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి తన జీవితమే మారిపోయిందన్నారు. తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందని చెప్పారు. తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ఆనందబాష్పాలు, చిరునవ్వులు, సంతోషాలు, డ్యాన్సులతో నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుక తమ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
ఢిల్లీలోని రాజీవ్ చౌక్‌లో గల కపుర్తాల హౌస్‌లో పరిణీతి, రాఘవ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, చిత్ర పరిశ్రమలోని సహచరులు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, పరిణీతి సోదరి ప్రియాంకా చోప్రా తదితరులు హాజరై కాబోయే కొత్త జంటను ఆశీర్వదించారు.
Also Read..
Nitesh Pandey | చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హోటల్ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు
Sourav Ganguly | త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా గంగూలీ
Donald Trump | ముదిరిన వివాదం.. ట్రంప్‌పై కోటి డాలర్లకు మరో పరువు నష్టం దావా వేసిన జీన్ కారోల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

