Raayan Movie | ఓటీటీలోకి ధనుష్ ‘రాయన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Raayan Movie | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
Raayan Movie OTT | తమిళ నటుడు ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ రాయన్ (Raayan). సందీప్ కిషన్, మలయాళం నటుడు కాళిదాస్ జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా సినిమా చూసిన వారంతా ధనుష్ దర్శకత్వం బాగుందని కితాబు ఇస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ఆగష్టు 23 నుంచి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. అతనో సాధారణ వ్యక్తి. మద్రాస్‌లోని ఓ హోటల్లో చెఫ్‌గా పనిచేస్తుంటాడు. కానీ అతని గతం మాత్రం పగతో రగిలిపోతుంటుంది. ప్రతీకారం తీర్చుకునే సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇంతకి ఆ వ్యక్తి ప్రతీకారం ఎవరి మీద? పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతను హోటల్లో చెఫ్‌గా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ‘రాయన్’ సినిమా చూడాల్సిందే అని చెబుతోంది చిత్ర బృందం. ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, విష్ణువిశాల్, దుషారా విజయన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషించారు.
Raayan has a PURPOSE to fulfill and JUSTICE to seek ⚖️🔥#RaayanOnPrime, Aug 23@dhanushkraja @arrahman @iam_SJSuryah @selvaraghavan @kalidas700 @sundeepkishan @prakashraaj @officialdushara @Aparnabala2 @varusarath5 #Saravanan pic.twitter.com/1I3mqFw0GR
— prime video IN (@PrimeVideoIN) August 16, 2024
Also Read..
- Shadnagar Incident | దళిత మహిళపై థర్డ్ డిగ్రీ.. షాద్‌నగర్ డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు
- Nagarjuna Sagar | నిండుకుండలా నాగార్జున సాగర్.. 4 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
- Hrithik Roshan | కఠిన శిక్షలే దురాగతాల అడ్డుకట్టకు ఏకైక మార్గం.. వైద్యురాలి హత్యాచార ఘటనపై హృతిక్ రోషన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

