‘హుషారు-2’లో నారాయణమూర్తి
యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకున్న ‘హుషారు’ (2018) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘హుషారు-2’. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్‌తేజ్, శశిధర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.
యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకున్న ‘హుషారు’ (2018) చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘హుషారు-2’. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్‌తేజ్, శశిధర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. టీజర్ చివరలో ‘తమ్ముళ్లు వేట మొదలెడదామా..’అంటూ ఆయన విప్లవ నాయకుడి పాత్రలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాలో నాకు గొప్ప పాత్ర ఇచ్చారు. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఆలోచింపజేసే కథ ఇది. నిరుద్యోగ సమస్య గురించి చర్చించడంతో పాటు యువత స్వతంత్రంగా, ఆత్మాభిమానంతో బతకాలనే సందేశాన్ని అందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు. నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని, నారాయణమూర్తిగారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన కనిపించే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

