PVR Cinemas | బంఫర్ ఆఫర్ ప్రకటించిన పీవీఆర్.. రూ.700 లకే 10 సినిమాలు
PVR Inox | కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు మెల్లిమెల్లిగా థియేటర్లకు వస్తున్నారు. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది.
PVR Inox | కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకులు మెల్లిమెల్లిగా థియేటర్లకు వస్తున్నారు. అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో ఆఫర్‌తో మన ముందుకు వచ్చింది.
ప్రస్తుత కాలంలో మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూడాలంటే పర్సు ఖాళీ అవ్వల్సిందే. ఒక్క వ్యక్తి సినిమాకు వెళ్లినా రూ.1000 వరకు ఖర్చు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేలా చేయడానికి పీవీఆర్ సినిమాస్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. జస్ట్ రూ.700లకే 10 సినిమాలను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పీవీఆర్ సినిమాస్ (PVR Cinemas) వెల్లడించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 16 నుంచి ప్రారంభంకానుంది.
#PVRINOX – Monthly Movie Pass – ₹700 pic.twitter.com/9wUx2SnUX0
— Aakashavaani (@TheAakashavaani) October 13, 2023
పీవీఆర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా.. 30 రోజులకు రూ.700 చెల్లించి ఏదైనా PVR థియేటర్లో 10 సినిమాలను వీక్షించవచ్చు. అయితే ఈ ఆఫర్ విక్ డేస్‌లో (సోమవారం నుండి శుక్రవారం) మాత్రమే వర్తించనుంది. ఇక హైదరాబాద్‌లోని సినీ ప్రేక్షకులు తమ అభిమాన సినిమాలను పెద్ద స్క్రీన్లపై చూసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతికి రాబోయే మోస్ట్-వెయిటింగ్ సినిమాలను ఈ పాస్ ద్వారా చూడవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

