Pushpa: రష్మిక మరో లుక్ విడుదల చేస్తూ సెకండ్ సాంగ్ ఎప్పుడో చెప్పిన మేకర్స్

ప్రస్తుతం టాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో పుష్ప ఒకటి. పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ కూడా వేగవంతం చేశారు.
పుష్ప మూవీ నుంచి విడుదలైన తొలి సాంగ్ ‘దాక్కో దాక్కో మేక’ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో తెల్సిందే. ఇప్పటికిప్పుడు యూట్యూబ్ చూసినా, ఏదో ఒక రికార్డ్ బద్దలవుతూ కనిపిస్తుంది. అందుకే వేడి తగ్గకుండా, మరో సింగిల్ ను రిలీజ్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ సాంగ్ అక్టోబర్ 13న విడుదల కానుందని తెలియజేస్తూ రష్మిక లుక్‌కి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. చూస్తుంటే సెకండ్ సాంగ్ శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న రష్మిక పై ఉంటుందని అర్ధమవుతుంది. ‘రంగస్థలం’లో ‘ఎంత సక్కగున్నావే’ అంటూ సమంతను దిష్టి తగిలేలా చూపించాడు సుకుమార్. ఇప్పుడు రష్మికపై కూడా అలానే చిత్రీకరించి ఉంటాడని ‘పుష్ప’రాజ్ అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- srivalli
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

