VijaySethupathi | డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా చిత్రయూనిట్ ఈ టీజర్ వెనుక ఉన్న కష్టాన్ని, షూటింగ్ ఆసక్తికర విశేషాలను చూపిస్తూ ఒక పవర్ఫుల్ “టీజర్ మేకింగ్ వీడియో”ను విడుదల చేసింది.
ఈ మేకింగ్ వీడియోలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనదైన మార్క్ స్టైల్లో సీన్లను ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఒక యాచకుడి పాత్రలో విలక్షణమైన గెటప్, విభిన్నమైన డైలాగ్ డెలివరీ, మరియు యాక్షన్ సీక్వెన్స్ కోసం పడిన శ్రమ ఈ వీడియోలో ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం సమాజంలో మనం చూసే యాచకుల వెనుక ఉండే కొన్ని నిజమైన సంఘటనలు మరియు బలమైన ఎమోషన్స్ ఆధారంగా తెరకెక్కుతోందని పూరి జగన్నాథ్ వివరించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి టబు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, హీరోయిన్గా సంయుక్త.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు.