వీపీఎఫ్ ఛార్జీల భారం ఎవరికి?
టాలీవుడ్లో బంద్ కొనసాగుతున్నది. సోమవారం కొందరు తెలుగు నిర్మాతల పరభాషా చిత్రాల షూటింగ్‌లపై విమర్శలు రాగా అవి సద్దుమణిగాయి. తెలుగు నిర్మాతలు చేసే ఇతర భాషా చిత్రాల షూటింగ్స్ కూడా ఆపేయాలని చిన్న నిర్మాతలు డిమాండ్ చేశారు. ఇక పరిశ్రమలోని ఒక్కో సమస్యను పరిష్కరించుకునే దిశగా నిర్మాతలు అడుగులు వేస్తున్నారు. బంద్ సమయాన్ని ఇందుకు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ఫిలింఛాంబర్లో ఎగ్జిబిటర్స్‌తో నిర్మాతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో థియేటర్లకు సినిమా కంటెంట్ పంపే వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) భారాన్ని ఎవరు భరించాలి అనే అంశంపై చర్చించారు.
ప్రస్తుతం క్యూబ్, యూఎఫ్‌వో, పీఎక్స్‌డీ వంటి వీపీఎఫ్లకు ఒక్కో ప్రింట్కు దాదాపు 9 వేల రూపాయలు నిర్మాతలు చెల్లిస్తున్నారు. ఇటీవల నిర్మాతల చర్చల్లో ఈ వీపీఎఫ్ ఖర్చు ఎగ్జిబిటర్స్ పెట్టుకోవాలని అభిప్రాయాలు వెల్లడయ్యాయి. తాజాగా జరిగిన సమావేశంలో ఆ ఖర్చు తాము భరించలేమంటూ, నిర్మాతలే పెట్టుకోవాలంటూ ఎగ్జిబిటర్స్ చెప్పారు. ఈ సమస్య పరిష్కారం కోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సినీ కార్మికుల వేతనాల అంశంపై కూడా నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

