‘జెర్సీ’ సినిమాకు అవార్డుల్ని ముందే ఊహించాం!

2019 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డుకు ఎంపికైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ‘జెర్సీ’ అవార్డు తాలూకు ఆనందాన్ని పంచుకుంటూనే..తమ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించిన తాజా చిత్రం ‘రంగ్‌దే’ ఈ నెల 26న విడుదలవుతున్న సందర్భంగా ఈ సినిమా విశేషాల్ని కూడా వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “జెర్సీ’ సినిమాకు పురస్కారాలు లభిస్తాయని ముందే ఊహించాం. మా సంస్థ నిర్మించిన సినిమాకు తొలిసారి నేషనల్ అవార్డు రావడం చాలా సంతోషాన్నిచ్చింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కథ చెప్పగానే అందులోని ఎమోషన్స్‌తో వెంటనే కనెక్ట్ అయిపోయా. స్వతహాగా నాకు క్రికెట్ అంటే ఇష్టం ఉండటంతో కథపై మరింత ఆసక్తికలిగింది. అయితే ఏడేళ్ల కొడుకు తండ్రి పాత్రకు హీరో నాని ఒప్పుకుంటాడో లేడో అనే సందేహాలొచ్చాయి. కథ వినగానే మరో ఆలోచన లేకుండా నాని సినిమాకు ఓకే చెప్పారు. ‘రంగ్‌దే’ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. 24ఏళ్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కథ ఇది. వినోదంతో పాటు భావోద్వేగాలు కలబోసి ఉంటాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడిగా మా సంస్థ నిర్మించే సినిమా ఏప్రిల్ నెలాఖరున లేదా మే మొదటివారంలో ప్రారంభమవుతుంది. పవన్‌కల్యాణ్, రానాతో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ బాగా వస్తోంది. తెలుగు నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేశాం. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్యరాజేష్ కథానాయికగా నటిస్తోంది. పవన్‌కల్యాణ్ సరసన నటించే నాయిక ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రస్తుతం ‘వరుడు కావలెను’ ‘నరుడి బ్రతుకు నటన’ సినిమాల చిత్రీకరణ జరుగుతోంది. మలయాళ చిత్రం ‘కప్పేలా’ను ‘బుట్టబొమ్మ’ పేరుతో రీమేక్ చేద్దామనుకుంటున్నాం. బెల్లంకొండ సురేష్ చిన్నబ్బాయి గణేష్‌బాబు కథానాయకుడిగా ఓ సినిమా చేస్తున్నాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

