Bimbisara Movie | ‘బింబిసార’ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్‌రాజు
Bimbisara Movie On OTT | ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ‘బింబిసార’ హవానే నడుస్తుంది. 2015లో వచ్చిన ‘పటాస్’ కళ్యాణ్‌రామ్‌కు బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్. ఆ తర్వాత మళ్ళీ ఏడేళ్ళకు ‘బింబిసార’తో ఆ స్థాయి విజయాన్ని అందుకున్నాడు. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బింబిసార నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దర్శకుడు మల్లిడి వశిష్ఠ డెబ్యూ సినిమానే అయినా.. తన టేకింగ్‌కు, పాత్రలను మలిచిన విధానంకు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధిడంతో చిత్ర యూనిట్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు.
ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా 50రోజుల తర్వాతే ఓటీటీలోకి రానున్నట్లు దిల్‌రాజు క్లారిటీ ఇచ్చాడు. అంటే ఈ చిత్రం ఓటీటీలో సెప్టెంబర్ చివరి వారంలో విడుదలయ్యే అయ్యే అవకాశం ఉంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ-5’ ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఫాంటసీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్‌లు కథానాయికలుగా నటించారు. కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సుమారు 5 కోట్ల వరకు ప్రాఫిట్స్ వచ్చాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

