సినిమా లేకుంటే వ్యవసాయం
‘గోకులంలో సీత’ సినిమా చూసి నేను పవన్‌కల్యాణ్ అభిమానిగా మారాను. కొడుకు పుడితే ఆయన పేరే పెట్టుకోవాలనుకున్నా. ‘తమ్ముడు’ టైంలో మాకు అబ్బాయి పుట్టాడు. ఆయన పేరే పెట్టాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. ఆయన తనయుడు పవన్‌కల్యాణ్ హీరోగా పరిచయమవుతున్న ‘పురుషః’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
‘గోకులంలో సీత’ సినిమా చూసి నేను పవన్‌కల్యాణ్ అభిమానిగా మారాను. కొడుకు పుడితే ఆయన పేరే పెట్టుకోవాలనుకున్నా. ‘తమ్ముడు’ టైంలో మాకు అబ్బాయి పుట్టాడు. ఆయన పేరే పెట్టాను’ అన్నారు నిర్మాత బత్తుల కోటేశ్వరరావు. ఆయన తనయుడు పవన్‌కల్యాణ్ హీరోగా పరిచయమవుతున్న ‘పురుషః’ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. వీరు వులవల దర్శకుడు. ఈ సందర్భంగా బుధవారం నిర్మాత బత్తుల కోటేశ్వరరావు విలేకరులతో ముచ్చటించారు. హీరో అవ్వాలనే తన కలను కొడుకు ద్వారా నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.
తమ అబ్బాయికి సిగ్గు, బిడియం చాలా ఎక్కువని.. సినిమాల వల్ల కలుపుగోలుతనం పెరిగి కాన్ఫిడెంట్‌గా తయారవుతారనే ఉద్దేశ్యంతో వాడిని హీరో చేశానని చెప్పారు. “పురుషః’ విభిన్నమైన కాన్సెప్ట్. ఆద్యంతం ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. ముఖ్యంగా ప్రేమకథలోని కొత్తదనం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, సప్తగిరి పండించే కామెడీ హైలైట్‌గా నిలుస్తుంది. మా అబ్బాయితో మూడు సినిమాలు చేస్తానని మాటిచ్చాను. సక్సెస్ అయితే ఓకే. లేకుంటే ఊరికి వెళ్లి వ్యవసాయం చేయాలని ముందుగానే చెప్పాను. ఈ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 300 థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ఈ వేసవిలో చక్కటి వినోదం కోసం ఈ సినిమా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతున్నా’ అని బత్తుల కోటేశ్వరరావు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

