Priyanka Chopra | ఆ సినిమా అనుభవం పరమచెత్త.. ఇష్టం లేకుండానే అందులో నటించా : ప్రియాంక చోప్రా
Actress Priyanka Chopra | ఇష్టం లేకున్నా హీరోయిన్లు కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. దానికి బోలెడన్ని కారణాలుంటాయి. పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. పెద్ద హీరో కూడా కారణం అయ్యిండచ్చు. సినిమా చేయను అంటే కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేస్తుంటారు. ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే చెప్పారు.
Actress Priyanka Chopra | ఇష్టం లేకున్నా హీరోయిన్లు కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. దానికి బోలెడన్ని కారణాలుంటాయి. పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు. పెద్ద హీరో కూడా కారణం అయ్యిండచ్చు. సినిమా చేయను అంటే కెరీర్ కు ఫుల్ స్టాప్ పడిపోతుందేమో.. ఆఫర్లు రావేమో అనే భయంతో చాలా మంది హీరోయిన్లు నచ్చకున్నా కొన్ని పాత్రలు చేస్తుంటారు. ఇదే విషయాన్ని ఎంతో మంది నటీమణులు బహిరంగంగానే చెప్పారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా అలాంటి బోల్డ్ స్టేట్మెంటే చేసింది. అయితే సినిమా పేరు ఏంటన్నది చెప్పలేదు కానీ.. ఆ సినిమా అనుభవం మాత్రం పరమచెత్త అని, ఆ సినిమా చేస్తుంటే అసహ్యమేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ప్రియాంక ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఆ సినిమా పేరు మాత్రం బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం పరమ చెత్త. సెట్స్ లో గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. సెట్స్ లో ఓ బొమ్మలా కూర్చునేదాన్ని, స్వతహాగా నేను ఆ టైపు కాదు. అందుకే ఆ సినిమా నాకు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటన్నది ప్రియాంక చెప్పలేదు.
ప్రస్తుతం ప్రియాంక బ్యాక్ టు బ్యాక్ హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను సాధిస్తుంది. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

