Priyanka Chopra | ప్రపంచ వేదికపై మరో గౌరవం… ప్రియాంకా చోప్రాకు ‘గ్లోబల్ వాన్గార్డ్ హానర్’
Priyanka Chopra | భారతీయ సినీ పరిశ్రమ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో సరిహద్దులను చెరిపేసిన నటి ప్రియాంక చోప్రా ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక గౌరవం చేరింది. ఆమెకు ‘గ్లోబల్ వాన్గార్డ్ హానర్’ అవార్డు లభించనుంది. ఈ అవార్డును అమెరికాలో నిర్వహించనున్న ‘గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా-2026’ వేడుకల్లో ఆమె అందుకోనున్నారు.
Priyanka Chopra | భారతీయ సినీ పరిశ్రమ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రతిభతో సరిహద్దులను చెరిపేసిన నటి ప్రియాంక చోప్రా ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక గౌరవం చేరింది. ఆమెకు ‘గ్లోబల్ వాన్గార్డ్ హానర్’ అవార్డు లభించనుంది. ఈ అవార్డును అమెరికాలో నిర్వహించనున్న ‘గోల్డ్ హౌస్ గోల్డ్ గాలా-2026’ వేడుకల్లో ఆమె అందుకోనున్నారు. మే 9న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ కార్యక్రమం ఇప్పటికే విశేష దృష్టిని ఆకర్షిస్తోంది.ఆసియా-పాసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రతిభావంతుల విజయాలను గుర్తించి సత్కరించే ఈ వేదికపై ప్రియాంకకు ఈ గౌరవం దక్కడం విశేషం. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, వివిధ రంగాల్లో ప్రభావం చూపిన నాయకులను కూడా ఈ వేడుకలో సత్కరించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఎంపిక కావడం భారతీయులకు గర్వకారణంగా మారింది.
ఇప్పటికే 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రియాంకా చోప్రా, మిస్ వరల్డ్ విజేతగా తన ప్రయాణాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. బాలీవుడ్లో అగ్రనటిగా ఎదిగిన ఆమె, తర్వాత హాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందింది. భిన్న సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తూ భారతీయ సినీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. నటిగా మాత్రమే కాకుండా, సామాజిక అంశాల్లోనూ చురుకుగా పాల్గొంటూ సమాజానికి తన వంతు సేవ అందించడం కూడా ఆమెకు ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిన వ్యక్తిగా ఆమెను గౌరవించడం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ ఏడాది ‘గోల్డ్ గాలా’ వేడుక ‘ఎ న్యూ గోల్డ్ వరల్డ్’ అనే అంశంతో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రియాంకతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. వ్యాపారం, సాంకేతికం, ఫ్యాషన్, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన సుమారు 650 మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ప్రియాంకా చోప్రా తన సినీ ప్రయాణాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న ‘వారణాసి’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌తో పాటు మరిన్ని అంతర్జాతీయ చిత్రాల్లోనూ ఆమె కనిపించనున్నారని తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

