Cinema News | రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా డార్లింగ్
బ్లాక్బాస్టర్ ‘హను-మాన్'ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి రానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్'.
Cinema News | బ్లాక్బాస్టర్ ‘హను-మాన్’ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి రానున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘డార్లింగ్’. ప్రియదర్శి, నభానటేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అశ్విన్‌రామ్ దర్శకుడు. జూలై 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన వస్తున్నది.
నేటి జనరేషన్‌కి కనెక్టయ్యే కంటెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారని, తమ సంస్థలో మరో బ్లాక్బాస్టర్గా ఈ సినిమా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: నరేశ్ రామదురై, మాటలు: హేమంత్, సంగీతం: వివేక్ సాగర్.
కొత్త దర్శకుడితో రానా నెక్ట్స్ మూవీ?
‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ తర్వాత విరామం తీసుకున్నారు హీరో రానా. ఆయన తదుపరి సినిమా ఏంటి? అనే విషయంపై ఫిల్మ్‌వర్గాల్లో ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి. తేజ దర్శకత్వంలో ‘రాక్షసరాజు’ సినిమా చేస్తున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ అది పట్టాలెక్కలేదు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే పౌరాణిక చిత్రం కూడా అనుకున్నారు.
అది కూడా ప్రస్తుతం హోల్డ్‌లోనే ఉంది. మరి ఈ రెండిట్లో ముందు మోక్షం దేనికో! అని అందరూ ఎదురు చూస్తుంటే.. అందరి ఆలోచనలను తల్లకిందులు చేస్తూ.. ఓ కొత్త దర్శకుడి కథను రానా ఓకే చేశారట.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కానున్నదట. ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించనున్న ఈ సినిమాకు కథానాయికగా ‘కేజీఎఫ్’ఫేం శ్రీనిధిని ఎంపిక చేసినట్టు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

