శివ కార్తికేయన్ జర్నీ స్ఫూర్తినిస్తుంది
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్'. అనుదీప్ కేవీ దర్శకుడు. సునీల్ నారంగ్, డి.సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ నెల 21న విడుదలకానుంది.
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్’. అనుదీప్ కేవీ దర్శకుడు. సునీల్ నారంగ్, డి.సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అగ్ర హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ నా సినీ ప్రయాణంలో కీలక పాత్రను పోషించాయి.‘ప్రిన్స్’ ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. అనుదీప్ పెద్ద సినిమాలు చేయడం, అందరికి నవ్వులు పంచడం చాలా ఆనందంగా ఉంది. నేను ఒత్తిడి నుంచి రిలీఫ్ కోసం అనుదీప్ వీడియోలు చూస్తుంటా.
శివకార్తికేయన్ ‘ రెమో ’చూసినప్పటి నుంచి ఆయన సినిమాలపై ఇంట్రెస్ట్ పెరిగింది. శివ కార్తికేయన్ సినీ ప్రయాణం ఎంతో స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. చాలా కష్టపడిపై కొచ్చాడు. నటుడిగా, నిర్మాతగా, గీత రచయితగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’అన్నారు. అనుదీప్ మాట్లాడుతూ ‘ఈ కథ శివకార్తికేయన్ కోసమే తయారు చేశా. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు పెద్ద హిట్ అయ్యాయి. సినిమా అందరిని నచ్చుతుందనే విశ్వాసముంది’ అని చెప్పారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ ‘మన ఇండియన్ సినిమాలో స్మార్టెస్ట్ హీరో విజయ్ దేవరకొండ. ఆయన ‘గీత గోవిందం’ సినిమా చాలాసార్లు చూశా. విజయ్ దేవరకొండ జర్నీ రాకెట్లా దూసుకుపోతున్నది. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని ఉంది. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ వంటి పెద్ద సంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

