Premalu | ప్రేమకు నిర్వచనం చెప్పమని ఈ తరాన్ని అడిగితే..
ప్రేమ పుట్టడానికి ఇరు హృదయాల్లో గొప్ప కెమికల్ రియాక్షన్ జరగాల్సిన పనిలేదు. అచ్చమైన ప్రేమ.. న్యూటన్ చర్యకు ప్రతిచర్య నియమాన్ని సంతృప్తి పర్చాల్సిన అవసరమూ లేదు. స్వచ్ఛమైన ప్రేమ చాలా సహజంగా పుడుతుంది. అసహజమైన పరిస్థితులను అతి సహజంగా మర్చిపోతుంది.
నటీనటులు: నాస్లెన్ కె.గపూర్, మాథ్యూ థామస్, మమిత బైజు, శ్యామ్ మోహన్ తదితరులు
దర్శకత్వం: గిరీశ్ ఎ.డి.
విడుదల: మార్చి 8
Premalu | ప్రేమకు నిర్వచనం చెప్పమని ఈ తరాన్ని అడిగితే.. చాలామంది సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఆకర్షణే ప్రేమని భావిస్తున్న నేటి యువత నుంచి ఏమని జవాబు ఆశిస్తాం! మూర్ఖంగా వెంటపడి లొంగదీసుకోవడమే లవ్ అని కొన్ని సినిమాలు చూపిస్తున్నాయి. పశువులా ప్రవర్తించే పురుషుడే నిజమైన ప్రేమికుడని కొందరు దర్శకుల నిశ్చితాభిప్రాయం. విపరీత సన్నివేశాలకూ ఊగిపోతూ ఈలలు కొడుతున్న నేటి యువతీ యువకులకు నిజమైన ప్రేమంటే ఏంటని అడిగితే ఏమని చెప్పగలరు?
ప్రేమ పుట్టడానికి ఇరు హృదయాల్లో గొప్ప కెమికల్ రియాక్షన్ జరగాల్సిన పనిలేదు. అచ్చమైన ప్రేమ.. న్యూటన్ చర్యకు ప్రతిచర్య నియమాన్ని సంతృప్తి పర్చాల్సిన అవసరమూ లేదు. స్వచ్ఛమైన ప్రేమ చాలా సహజంగా పుడుతుంది. అసహజమైన పరిస్థితులను అతి సహజంగా మర్చిపోతుంది. ఈ మర్చిపోయే క్రమంలో కాస్త తికమకలు ఉంటాయి. బెట్టు చేయడాలూ ఉంటాయి. ప్రేయసి తన పట్టు తప్పుతుందన్న ఆందోళన ప్రేమికుడ్ని నరకంలో కూలదోస్తుంది. అతను ఇచ్చే చిన్న మెచ్చుకోలు ఆమెను ఎవరెస్ట్ శిఖరంపై కూర్చోబెడుతుంది. ఈ ప్రేమను అర్థం చేసుకోలేక, ఎదుటివ్యక్తి తనపై చూపుతున్న అభిమానం లోతు అంచనా వేయలేక అగాథం వైపు నడిచేవాళ్లు ఎందరో! కానీ, ఆ మనసులో తనకెంత గొప్పస్థానం ఉందో తెలిశాక.. ఈ మనిషి కండ్లు చెమ్మగిల్లకుండా ఉండగలవా?
ఇలాంటి ఓ సహజమైన ప్రేమ కథే.. ‘ప్రేమలు’. మాలీవుడ్‌లో గతనెల విడుదలై తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మౌత్ పబ్లిసిటీతో తెలుగునాట హౌజ్‌ఫుల్ కలెక్షన్లు సాధిస్తున్నది. కథలోకి వెళ్తే.. సచిన్ సంతోష్ (నాస్లెన్ కె.గపూర్) బీటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. పై చదువుల కోసం యూకే వెళ్లాలనుకుంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో తన స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్)తో కలిసి హైదరాబాద్‌కు వస్తాడు. గేట్ కోచింగ్‌లో జాయిన్ అవుతాడు. రీనూ (మమిత బైజు) సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తుంటుంది. కామన్ ఫ్రెండ్ పెండ్లిలో సచిన్, రీనూ కలుసుకుంటారు. తొలిచూపులోనే రీనూను ప్రేమిస్తాడు సచిన్. రీనూ ఆఫీస్‌లో టీమ్‌లీడర్‌గా ఉన్న ఆది (శ్యామ్ మోహన్) ఆమెను ఇష్టపడుతుంటాడు. రోజులు గడిచేకొద్దీ రీనూ, సచిన్ మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు సచిన్ రీనూతో తన మనసులో మాట చెబుతాడు. దానికి ఆమె ఏమంది? సచిన్, రీనూ ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన కథ!

స్టోరీలైన్ చిన్నదే! రొటీన్‌గా విన్నదే! కానీ, దాన్ని దర్శకుడు గిరీశ్ తెరకెక్కించిన విధానం అద్భుతంగా పండింది. దీనికితోడు తెలుగు డబ్బింగ్ వెర్షన్లో ‘#90’s’ దర్శకుడు ఆదిత్య హాసన్ రాసిన మాటలు ‘ప్రేమలు’లో నవ్వులు పండిస్తాయి. మీమ్స్ లాంగ్వేజ్ డైలాగులు ఈ తరానికి బాగా కనెక్ట్ అవుతాయి. స్టార్టప్ కల్చర్, యావరేజ్ స్టూడెంట్ యాటిట్యూడ్, ఈ తరం అమ్మాయిల అత్యాశలు ఇవన్నీ ‘ప్రేమలు’ చిత్రాన్ని యూత్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. పతాక సన్నివేశాల్లో పండిన భావోద్వేగాలు ప్రేక్షకుడికి రిలీఫ్ ఇస్తాయి. ఫీల్ గుడ్ మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది. చివరిగా.. ఫాంటసీ ప్రేమల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్లు… ‘ప్రేమలు’ చూశాక, గతంలో తమ హృదయాన్ని తాకిన నిజమైన ప్రేమను తలచుకోకుండా ఉండలేరు!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింపుల్ లుక్‌తోనే మాయ చేస్తోన్న వైష్ణవి చైతన్య.. ఫొటోలు చూశారా?
Ghee Benefits | నెయ్యితో యవ్వనం సాధ్యమేనా? చర్మ సౌందర్యానికి నెయ్యి ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
CM Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. భగవంత్ మాన్కు 50వేల ఫైన్
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

