Premaku Namaskaram | యూట్యూబ్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్ గ్లింప్స్ విడుదల
Premaku Namaskaram | కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు.
Premaku Namaskaram | కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్ చిత్రంతో యూట్యూబ్ సన్సేషన్, మీమ్ కంటెంట్ క్రియేటర్ మౌళి తనూజ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్ సన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్ పతాకంపై అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్ దర్శకుడు. మంగళవారం హీరో షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి ‘ప్రేమకు నమస్కారం’ అనే టైటిల్‌ని నిర్ణయించారని తెలియజేయడంతో పాటు ఇందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు మేకర్స్.
ఈ గ్లింప్స్ వీడియోను గమనిస్తే.. ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్లా కనిపిస్తుంది. లవ్ ఫెయిల్యూర్స్.. లవ్ బ్రేకప్ అయిన వాళ్లంతా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్లఫ్రెండ్స్ తమకు ఎలా హ్యాండ్ ఇచ్చారు అని చెప్పుకునే ఫన్నీ బాధలు అన్ని ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. ఇక ఫైనల్‌గా ఫణ్ముఖ్ ఇది పాన్ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు ఖర్చు పెట్టే డబ్బులతో కైలాసగరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చు అని చెప్పే సంభాషణలు నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు ఎంతో కనెక్ట్ అవుతాయి.టోటల్‌గా ప్రేమకు నమస్కారం అనే టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. ముఖ్యంగా నేటి యువత లవ్, బ్రేకప్అప్, ఇలా అన్ని అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాం. నేటి యువత బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ” వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్రమిది. కొత్తదనం, హిలేరియస్ ఎంటర్టైనర్మెంట్ ఈ చిత్రంలోని ప్రత్యేకతలు. తప్పకుండా చిత్రం మీ ఆదరణ పొందుతుంది’ అన్నారు.
షణ్ముఖ్ జస్వంత్, శివాజీ, భూమిక, ఉల్కగుప్తా, బ్రహ్మాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, అరుణ్ అదిత్, రంగస్థలం మహేష్, మణిచందన, కమల్, క్రాంతి, నీల రమణ, శోభన్, సుభాష్, కొటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీవోపీ కిషోర్ బోయిడపు, సంగీతం: గ్యానీ, ఎడిటర్: కేసీబీ హరి, లిరిక్స్: సరస్వతి పుత్రి రామజోగయ్య శాస్త్రి, దినేష్ కాకెర్ల, ఆర్ట్: రవికుమార్, కొరియోగ్రఫీ: శ్రావణ్, విశాల్, ప్రొడక్షన్: రమేష్ వర్మ, నిర్మాతలు: అనిల్ కుమార్ రవడ, భార్గవ్ మన్నె రచన-దర్శకత్వం: భీమ శంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

