Patang | పతంగ్ ఎగిరేది అప్పుడే.. రిలీజ్ టైం ఫిక్స్ చేసిన మేకర్స్
patang | పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తోపాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.
Patang | ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్షకులు చూసి వుంటారు. కాని అందరిలో ఎంతో మమేకమైన పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పతంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తోపాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు.
మరికొంత మంది నూతన నటీనటులతోపాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఆడియెన్స్‌కు ఓ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడానికి హెవీ సీజీ వర్క్‌ను గత కొంత కాలం నుంచి ఎంతో క్వాలిటీతో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో చేయిస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటుంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి.
సినిమా చూస్తున్నంత సేపు ఆ పంతగుల పోటీ మీలో ఉత్సుకతను కలిగిస్తుంది. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం వుంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం వుంది. డిసెంబరు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.
#Patang on 25th December 2025. pic.twitter.com/4BylenedWV
— Rajesh Manne (@rajeshmanne1) October 20, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA Bloc | ఇండియా బ్లాక్ కూటమిలో విబేధాలు.. సుప్రీంకోర్టులో పిటిషన్‌కు దూరంగా ప్రధాన పార్టీలు
ECB | ఇంగ్లండ్ స్క్వాడ్‌లో కొత్త కుర్రాళ్లు.. బెథెల్, ఆర్చర్‌కు పిలుపు..!
Auto Immune Diseases | మహిళల్లో అధికమవుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధుల సమస్య.. జాగ్రత్తలు తప్పనిసరి..
Sai Pallavi | ప్రభాస్ ‘కల్కి 2’ మూవీకి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్.. షూటింగ్ అప్డేట్!
Bernie Sanders | డొనాల్డ్ ట్రంప్‌పై పెట్టుబడితో మస్క్‌కు లక్షల కోట్ల లాభం.. బెర్నీ శాండర్స్ ఎద్దేవా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

