ప్రశ్నించే ప్రతినిధి- 2
నారా రోహిత్ నటించిన రాజకీయ నేపథ్య చిత్రం ‘ప్రతినిధి’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘ప్రతినిధి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నారా రోహిత్ నటించిన రాజకీయ నేపథ్య చిత్రం ‘ప్రతినిధి’. పదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. దాంతో ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘ప్రతినిధి 2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపును దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమార్ రజాబత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ విషయాన్ని ఉగాది సందర్భంగా నిర్మాతలు ప్రకటించారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తున్నదని, సినిమా అంతకు మించిన స్థాయిలో ఉంటుందని, నారా రోహిత్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలువనుందని నిర్మాతలు తెలిపారు. నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్‌గా నారా రోహిత్ నటిస్తున్న ఈ చిత్రంలో సిరీ లెల్లా కథానాయిక. దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

