సింగారి సిన్నదానా.. నీ ఇంటి దారుల్లోనా..
సౌతిండియన్ సన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా రూపొందిన పాన్ఇండియా మూవీ ‘డ్యూడ్'. ‘ప్రేమలు’ఫేం మమిత బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సౌతిండియన్ సన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా రూపొందిన పాన్ఇండియా మూవీ ‘డ్యూడ్’. ‘ప్రేమలు’ఫేం మమిత బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 17న దీపావళి కానుకగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఈ సినిమా నుంచి మూడోపాటను విడుదల చేశారు. ‘సింగారి సిన్నదానా.. నీ ఇంటి దారుల్లోనా..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ స్వరపరచి స్వయంగా ఆలపించారు.
హీరో ప్రదీప్ అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో సాగే సన్నివేశాలు ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చాయి. యూత్ మెచ్చేలా మంచి బీట్తో పాట సాగింది. శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రోహిణి మొల్లెటి, హృదు హరూన్, ద్రవిడ్ సెల్వం ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: నికేత్ బొమ్మి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

