Pradeep | ఎట్టకేలకి పెళ్లి వార్తలపై స్పందించిన యాంకర్ ప్రదీప్.. క్రికెటర్ తో పెళ్లి..!
Pradeep | టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్, హోస్ట్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా ఎన్నో షోలతో అలరించిన ప్రదీప్.. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Pradeep | టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్, హోస్ట్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా ఎన్నో షోలతో అలరించిన ప్రదీప్.. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ప్రదీప్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. త్వరలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ప్రదీప్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రదీప్ పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ప్రదీప్.. ఓ ప్రజా ప్రతినిధిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ప్రదీప్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు. తనకు కెరియర్ పరంగా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయి. చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటినీ చేరుకోవడానికి కొంత కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం తాను పెళ్లి గురించి ఆలోచించలేదని వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు. లైఫ్‌లో సెటిల్ కావాలని అనుకొన్నాను. నాకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకొనేందుకు ముందుగా ప్రయత్నిస్తున్నాను అని ప్రదీప్ మాచిరాజు అన్నారు.
ఇలా నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నింటినీ నేను కూడా వింటూ ఉన్నాను. ముందు ఒక బిజినెస్ ఉమెన్ కూతురితో నా పెళ్లి జరుగుతుందని అన్నారు. తర్వాత ఓ ప్రజా ప్రతినిధితో పెళ్లి అంటున్నారు. ఇక క్రికెటర్ తో పెళ్లి అని ప్రచారం చేస్తారేమో అంటూ సరదాగా ఈయన తన పెళ్లి గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఇలా నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నింటినీ నేను కూడా వింటూ ఉన్నాను అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రదీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మరాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

