Prabhas X Hombale | ప్రభాస్ సంచలన నిర్ణయం.. ‘కేజీఎఫ్’ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లు ఒకే చేసిన డార్లింగ్
Prabhas X Hombale | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన డార్లింగ్ తాజాగా కన్నడ ఇండస్ట్రీ టాప్ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లను సంతకం చేశాడు.
Prabhas X Hombale | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన డార్లింగ్ తాజాగా కన్నడ ఇండస్ట్రీ టాప్ బ్యానర్‌తో 3 ప్రాజెక్ట్‌లను సంతకం చేశాడు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్(Homable Films) తాజాగా ప్రభాస్‌తో బంఫర్ ఆఫర్ కొట్టేసింది.
ప్రభాస్‌తో ఒక్క సినిమా తీస్తేనే అదృష్టం అనుకుంటున్న సమయంలో ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లను ఒప్పందం చేసుకుంది. అవును 2026 నుంచి 2028 వరకు ప్రభాస్‌తో మూడు భారీ ప్రాజెక్ట్‌లు ఉండబోతున్నట్లు హోంబాలే ఫిలింస్ ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌లలో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏడాదికో క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ముందుగా సలార్ 2 రాబోతుంది అంటూ హోంబాలే వెల్లడించింది.
దీన్ని బట్టి చూస్తే.. ప్రభాస్ మరో నాలుగు సంవత్సరాలు ఫుల్ బిజీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మారుతితో రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ దీని అనంతరం హను రాఘవపూడితో ఫౌజీ చేస్తున్నాడు. ఇవే కాకుండా లైన్లో సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ప్రశాంత్ వర్మ చిత్రాలు ఉన్నాయి.
𝐌𝐚𝐝𝐞 𝐢𝐧 𝐈𝐧𝐝𝐢𝐚 𝐚𝐧𝐝 𝐁𝐮𝐢𝐥𝐭 𝐭𝐨 𝐋𝐚𝐬𝐭!#PrabhasXHombal3Films
We are proud to unite with the Rebel Star, #Prabhas, in a groundbreaking three-film partnership that celebrates the essence of Indian cinema and aims to take it to the world. This is a declaration of… pic.twitter.com/E4osJGaMgR
— Hombale Films (@hombalefilms) November 8, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

