కొత్త టైటిల్ అదేనా..?
వరుస సినిమాలతో మరో ఏడాది వరకు అగ్ర హీరో ప్రభాస్ కాల్షీట్స్ ఖాళీగా లేనట్లే కనిపిస్తున్నది. ఇటీవలే ‘ఆదిపురుష్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘సలార్'తో పాటు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటు బిజీగా ఉన్నారు.
వరుస సినిమాలతో మరో ఏడాది వరకు అగ్ర హీరో ప్రభాస్ కాల్షీట్స్ ఖాళీగా లేనట్లే కనిపిస్తున్నది. ఇటీవలే ‘ఆదిపురుష్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-కె’ ‘సలార్’తో పాటు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటు బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రాన్ని హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ యాక్షన్ ఇమేజ్ను ఎలివేట్ చేస్తూనే తనదైన శైలి వినోదాత్మక అంశాలతో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ను పెట్టబోతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘రాయల్’ ‘అంబాసిడర్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ‘రాయల్’ అనే టైటిల్ వైపే చిత్ర బృందం ఎక్కువగా మొగ్గు చూపుతున్నదని సమాచారం. అయితే ఈ విషయంలో చిత్ర నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు హారర్ కామెడీ జోనర్‌ను టచ్ చేయకపోవడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

