Prabhas – Raaja Saab | ‘రాజా సాబ్’ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్న ప్రభాస్.. ఎప్పుడంటే.?
Prabhas – Raaja Saab | టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతేడాది సలార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు.. లేటెస్ట్గా కల్కి 2898 ఏడీతో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి.
Prabhas – Raaja Saab | టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తోచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గతేడాది సలార్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు.. లేటెస్ట్గా కల్కి 2898 ఏడీతో మరో బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. అయితే సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం రాజా సాబ్(). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ప్రభాస్ లేని కీలక సన్నివేశాలను చిత్రబృందం ప్రస్తుతం తెరకెక్కిస్తుంది. అయితే కల్కి మూవీ విడుదల అయ్యి ప్రభాస్ ఫ్రీ అవ్వడంతో రాజా సాబ్ షూటింగ్లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
జులై చివరి వారంలో ప్రభాస్ రాజా సాబ్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారని టాక్. ఇక ఈ షెడ్యూల్లో ప్రభాస్‌పై ముఖ్యమెన సీన్స్ షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. మొదట ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. కానీ ప్రభాస్ పాన్ వరల్డ్ లెవల్లో ఉన్న ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్‌ను ఛేంజ్ చేశారు. మొదట ‘రాజా డీలక్స్’ అని ఉన్న ఈ టైటిల్‌ను రాజా సాబ్ అని మార్చారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
-
Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసుల కీలక చర్యలు.. పలువురు వ్యక్తుల అరెస్ట్..
-
MLC Tata Madhu | కోదండ రెడ్డి నీకు సిగ్గుందా..! మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు
-
Vangalapudi Anitha | పిన్నెల్లిని పరామర్శించేందుకు 25 లక్షలు ఖర్చు చేసిన జగన్.. హోంమంత్రి అనిత ఫైర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

