Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసుల కీలక చర్యలు.. పలువురు వ్యక్తుల అరెస్ట్..
Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘనటలో సత్సంగం ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధాలు ఉన్న ఆరుగురును వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు.
Hathras Stampede | హత్రాస్ తొక్కిసలాట కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ ఘనటలో సత్సంగం ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధాలు ఉన్న ఆరుగురును వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాన నిర్వాహకుడిని పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించినట్లు అలీగఢ్ ఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్టు చేసేందుకు ఎస్ఓజీ బృందాలను నియమించామన్నారు. అలాగే, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల మేరకు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాబా పాద ధూళి తీసుకుంటే కష్టాలు తొలగిపోతాయని అరెస్టయని వ్యక్తులు చెప్పారన్నారు. అరెస్టు అయిన వ్యక్తులంతా సేవలకు పని చేస్తున్నామని చెప్పారని అన్నారు. కమిటీకి అధ్యక్షుడు, సభ్యులు ఉన్నారని విచారణలో తెలిపారన్నారు.
అవసరమైతే బాబాను ప్రశ్నిస్తామన్నారు. అప్పటి వరకు 121 మంది మృతి చెందారని.. మృతుల ఆచూకీ గుర్తించినట్లు తెలిపారు. పోస్టుమార్టం ప్రక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. ఈ ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు మధుకర్‌ను పట్టుకునేందుకు రూ.లక్ష రివార్డును ప్రకటించామని.. త్వరలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబోతున్నట్లు చెప్పారు ఈ ఘటనలో ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నట్లు ఐజీ పేర్కొన్నారు. జనాలు ఒకేసారి గుంపుగా రాగా.. నిర్వాహకులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత ఒకేసారి బయటకు రావడంతో ప్రమాదం జరిగిందన్నారు. మహిళలు, పిల్లలు ఒకరిపై పడిపోయారన్నారు. భోలే బాబా నేర చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామని ఐజీ వెల్లడించారు. అయితే, సత్సంగ్‌కు ఆయన పేరుతో కార్యక్రమానికి అనుమతి తీసుకోలేదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

