Project K Trailer | నాగ్అశ్విన్ భారీ ప్లాన్.. అంతర్జాతీయ వేదికపై ప్రాజెక్ట్ కే ట్రైలర్ రిలీజ్..
Project K Trailer | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్-కె’ చిత్రం నిర్మాణ దశ నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. సూపర్‌హీరో కథాంశంతో హాలీవుడ్ స్థాయి సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడు.
Project K Trailer | ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్-కె’ చిత్రం నిర్మాణ దశ నుంచే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది. సూపర్‌హీరో కథాంశంతో హాలీవుడ్ స్థాయి సాంకేతిక హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కాలిఫోర్నియాలో జరిగే శాండియాగో కామిక్ ఈవెంట్ – 2023లో లాంచ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డులకెక్కబోతున్నది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ప్రభాస్ పాత్రను క్యారికేచర్ రూపంలో చూపించారు. ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్‌హీరోగా ఆయన లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
ఈ నెల 20న మొదలయ్యే శాండియాగో కామిక్ కాన్ ఈవెంట్లో ‘ప్రాజెక్ట్-కె’ టైటిల్‌తో పాటు చిత్ర ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్అశ్విన్ మాట్లాడుతూ ‘మన దేశం గొప్ప కథలకు, సూపర్‌హీరోలకు నిలయం. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. కామిక్ కాన్ ఈవెంట్ ద్వారా మా చిత్రం ప్రపంచ ప్రేక్షకులకు చేరువవుతుంది’ అన్నారు. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్, దిశా పటానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

