టాలీవుడ్ రెబల్ కుటుంబంలో యంగ్ హీరోగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ ప్రభాస్. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న అతికొద్ది మంది హీరోల్లో ప్రభాస్ కూడా ఒకరు. ఇప్పుడు ఆయన సినిమా లైనప్ చూసి అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిత్యం వార్తలలో ఉండే ప్రభాస్‌కి సంబంధించి ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రభాస్ అతి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త హల్ చల్ చేస్తుంది.
ప్రభాస్ తన డ్రీమ్ హౌస్ ని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో ఆయన ఓ విల్లాను నిర్మించుకోవాలని ఆశపడుతున్నారు. అందుకే ఏమాత్రం లేట్ చేయకుండా హైదరాబాద్ లో భారీ స్థాయిలో విల్లాను కట్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ ముంబైలో ఓ బంగ్లాను కొన్నారు. ఇక హైదరాబాద్ లో అతి పెద్ద విల్లాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నానక్ రామ్గుడాలో రెండు ఎకరాల్ని 120 కోట్ల రూపాయలతో కొన్నారు. ఈ స్థలంలో 80 కోట్ల రూపాయలు పెట్టి విల్లాను నిర్మిస్తున్నారనే టాక్ నడుస్తుంది.
ప్రభాస్ తన సొంత ఇంటి కల కోసం మొత్తంగా 200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్ ఎంతైనా.. అనుకున్న హౌస్ ను నిర్మించుకుంటున్నారు అనే ఆనందమే ప్రభాస్‌కి ఎక్కువగా ఉందని సన్నిహితులు అంటున్నారు. అలాగే ప్రభాస్ పెళ్ళి తర్వాత ఇదే విల్లాలో ఉంటే బావుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ ఏపీ వరద బాధితులకు కోటి రూపాయలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.