ముంబై : కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ నిర్ధేశకత్వంలో తెరకెక్కిన సలార్ మూవీ ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ప్రభాస్ ఫ్యాన్స్ హంగామాతో సలార్ ఫీవర్ పీక్స్‌కు చేరింది. ముంబైలో ప్రభాస్ ఫ్యాన్స్ 120 అడుగుల యంగ్ రెబల్‌స్టార్ భారీ కటౌట్ (Viral Pic) ఏర్పాటు చేయడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ముంబైలోని మాల్ ఎదురుగా ఈ కటౌట్ ఏర్పాటు చేయగా తొలిసారి ఈ స్ధాయిలో దక్షిణాది నటుడి కటౌట్ ఏర్పాటు చేయడం సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఇక కటౌట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. సలార్‌లో ప్రభాస్‌తో పాటు శ్రుతి హాసన్, శ్రియా రెడ్డి జగపతిబాబు, టిను ఆనంద్, బాబీ సింహ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
ఇక ప్రభాస్ ప్రతిష్టాత్మక మూవీ సలార్ షారుక్ ఖాన్ మూవీ డంకీతో బాక్సాఫీస్ వద్ద తలపడనుండటం ఆసక్తి రేపుతోంది. సలార్ ఈనెల 22న విడుదల కానుండగా, షారుక్ మూవీ డంకీ ఒకరోజు ముందుగా 21న విడుదలవుతోంది.
Read More :
TOBY Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ సూపర్ హిట్ మూవీ ‘టోబి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?