Radha Krishna Kumar | రాధేశ్యామ్ దర్శకుడికి మరో చాన్స్ ఇచ్చిన ప్రభాస్..!
ఒక పెద్ద హీరోతో సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడం దర్శకులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి దర్శకులు ఆసక్తి చూపరు.
Prabhas | ఒక పెద్ద హీరోతో సినిమా డిజాస్టర్ అయితే ఆ తర్వాతి ప్రాజెక్ట్ లాక్ చేసుకోవడం దర్శకులకు పెద్ద సవాలే. ఎందుకంటే ఒక స్టార్ హీరోతో సినిమా చేశాక, మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేయడానికి అంతగా ఆసక్తి చూపరు. ఇక పెద్ద హీరోలేమో చాన్స్‌లు ఇవ్వరు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. జిల్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రాధాకృష్ణ, రెండవ సినిమాకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ తీసే చాన్స్ కొట్టేశాడు. కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా రాధేశ్యామ్ మిగిలింది.
అయితే ప్రభాస్ మాత్రం ఇంకా రాధాకృష్ణపై నమ్మకంతోనే ఉన్నాడట. అందుకే తన స్వంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్‌లో మరో సినిమాకు చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ గోపిచంద్‌ను హీరోగా పెట్టి ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాడట. రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ మీడియాలు తెలుపుతున్నాయి. అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చాన కానీ ప్రభాస్ మరో చాన్స్ ఇచ్చాడంటే రాధాకృష్ణపై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో తెలుస్తుంది.
ఇక గోపిచంద్ ప్రస్తుతం ‘రామబాణం’ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక గతకొన్నేళ్లుగా గోపిచంద్‌కు హిట్టే కరువైంది. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్టు మరోటి పడలేదు. మధ్యలో ‘జిల్’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా కమర్షియల్‌గా భారీ హిట్లు సాధించలేకపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

